Trending

రైతు కోసం దేవునితోనైనా కొట్లడుత, KCR comments on Apex counsel

 తెలంగాణ వ్యవసా యాన్ని , రైతన్నను కాపాడుకునే విషయంలో దేవునితోనైనా కొట్లాటకు KCR comments on Apex counsel సిద్ధమని ముఖ్యమంత్రి కె . చంద్రశేఖరరావు స్పష్టం చేశారు . ఈ నెల 6 న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపించాలని అధి కారులను ఆదేశించారు .

 కౌన్సిల్ భేటీలో అనుస రించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు గురు వారం జలవనరుల శాఖ ఉన్నతస్థాయి అధికారు లతో సమావేశాన్ని నిర్వహించారు . తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని ఈ సందర్భంగా సీఎం అన్నారు . రాష్ట్రంలో వ్యవ సాయ రంగంలో పండగ వాతావరణం నెలకొం దని , పంటల దిగుబడిలో తెలంగాణ రైతు దేశా నికే ఆదర్శంగా నిలిచాడని , రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారిందని పేర్కొన్నారు . సాగు నీటి రంగాన్ని బలోపేతం చేస్తూ నదీ జలాలను ఒడిసి పట్టుకొని తెలంగాణ బీళ్లను సస్యశ్యా మలం చేస్తున్నామన్నారు . KCR comments on Apex counsel తెలంగాణ , ఆంధ్రప్ర దేన్ల మధ్య నదీ జలాలపై జరిగే సమావేశంలో బలమైన వాదనలు వినిపించాలన్నారు .

 ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ , ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ , సీఎంఓ అధికారులు నరసింగరావు , భూపాల్ రెడ్డి , నీటిపారుదల రంగ సలహాదారు ఎస్ . కె.జోషి , ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ , ఇంజినీర్ ఇన్ చీప్లు మురళీధర్ , నాగేందర్ రావు , హరిరాం తదితరులు పాల్గొన్నారు . అపెక్స్ కౌన్సిల్ సమా వేశం ఎజెండాలోని అంశాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు . అంశాలవా రీగా సమగ్రంగా చర్చించినట్లు తెలిసింది .

Related Articles

Back to top button