ఈరోజే మీ బ్యాంక్ అకౌంట్ లో కి 500 రూపాయలు, Govt to deposit 500 in Bank

ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ సమయంలో ప్రజలను ఆదుకోవడానికి Govt to deposit 500 in Bank కోవిడ్ – 19 ప్యాకేజీలో భాగంగా నేటి నుంచి జన్ దన్ అకౌంట్ లో రూపాయలు 500 వందల చొప్పున జమ చేస్తాం అని ఇదివరకే ప్రకటించారు.

 ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది పేద మహిళల ఖాతాల్లో శుక్రవారం ( నేడు ) నుంచి రూ . 500 జమ అవనున్నాయి . 21 రోజుల లాడౌన్ నేపథ్యంలో ఉపశమనంగా కేంద్రం ప్రకటించిన విధంగా ఈ నగదు ప్రయోజనం నేరుగా మహిళల బ్యాంక్ ఖాతాల్లో Govt to deposit 500 in Bank చేరనుంది.

 ప్రధాన మంత్రి కల్యాణ్ యోజన కింద ప్రభుత్వం ఈ మేరకు పేదలకు ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే . అయితే నగదు ఉపసంహరించుకోవడానికి బ్యాంకుల వద్దకు మహిళలు గుంపులు గుంపులుగా వచ్చే అవకాశం ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది .

 దీన్ని అరికట్టేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసింది . అకౌంట్ నంబర్ ఆధారంగా ఖాతాదారులను వేర్వేరు రోజుల్లో బ్రాంచుల వద్దకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించింది .

 ఉదాహరణకు ఖాతా నంబర్ చివర్లో వున్న నంబర్ ఆధారంగా  ఖాతాదారులను బ్యాంకులకు రమ్మని కోరతారు . ఈ మేరకు ఏర్పాటు చేసుకోవాలని ఖాతాదారులకు సెల్ ఫోనళ్లు బ్యాంక్ బ్రాంచులు సందేశాలు పంపిస్తాయి అని అన్నారు.

 గురువారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పీఎం నరేంద్ర మోడీ ఈ సందర్భంగా బ్యాంకు బ్రాంచుల వద్ద జనాల రద్దీ లేకుండా చూసుకోవాలని కోరారు . పీఎం గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద నిధులను విడుదల చేయనున్నట్టు ప్రధాని మోడీ ముఖ్యమంత్రులకు వెల్లడించారు.

Related Articles

Back to top button