ప్రాణం ఉన్నంత వరకు KCR పై పోరాటం చేస్తా- రేవంత్ రెడ్డి, Revanth reddy gets bail

రేవంత్ రెడ్డికి బెయిల్ Revanth reddy gets bail నాటకీయ పరిణామాలు నెలకొన్నాయి . రేవంత్ రెడ్డి తరపున  న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదనలు వినిపించారు, మంత్రి కే టి ఆర్ నివాసంపై డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారన్న అభియోగాల కేసులో అరెస్టయిన మల్కాజిగిరి ఎంపీ  రేవంత్ రెడ్డికి బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

రూ . 10 వేల వ్యక్తిగత పూచీకత్తు క్రమంలో సమర్పించాలని రాజేంద్రనగర్ కోర్టు నిర్ణయించింది.

చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్ రెడ్డికి బెయిల్ Revanth reddy gets bail రావడంతో బుధవారం భారీ బందోబస్తు నడుమ పోలీసులు అతన్ని జైలు నుంచి తరలించారు . రేవంత్ రెడ్డికి  బెయిల్ మంజూరైన విషయం తెలిసిన కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు , అభిమానులు పెద్దఎత్తున చర్లపల్లి జైలు వద్దకు తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రేవంత్ రెడ్డి కోసం వచ్చిన ఎంపీ మల్లు రవికి పోలీసులకు నడుమ తీవ్ర  వాగ్వివాదం చోటు చేసుకుంది . బెయిల్ పై కోర్టు కొన్ని షరతులు విధించింది, అదికారులకు సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది . 

తరువాత ఎంపీ రేవంత్ రెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ ఇక ఢిల్లీ వెళ్లకుండా హైదరాబాద్లోనే ఉంటానని, ఇక పై ఇక్కడే ఉండి పోరాటం చేస్తా,  గొంతులో ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పై   పోరాటం చేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు .

జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో రేవం రెడ్డి మాట్లాడారు . ఈ పోరాటం నా వ్యక్తిగతం కాదని , రెండు నెలల క్రితం కేసీఆర్ అవినీతిని బయటపెట్టాలని రాష్ట్ర ఇన్చార్జి కుంతియా నాకు బాధ్యతలు అప్పగించారన్నారు . కుంతియా ఆదే శాల మేరకు జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌసన్ను రంగారెడ్డి జిల్లా నేతలతో కలిసి ప్రజలకు చూపించానన్నారు .

Recent posts::

Related Articles

Back to top button