కరీంనగర్ లో హై అలర్ట్, 144 సెక్షన్ విధింపు. corona virus cases in Karimnagar

కరీంనగర్ లో కరోనా వైరస్ కలకలం::

కరీంనగర్ పట్టణంలో హై అలర్ట్ ప్రకటించారు, 144 సెక్షన్ విధించిన పోలీసులు, corona virus cases in Karimnagar ఐదుగురి కన్నా ఎక్కువగా గుమిగూడ కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు . ఇటీవల పట్టణంలో ఇండోనేసియా బృందం సభ్యులు సంచరించిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు .

ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు . మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు . గురువారం ఉదయం , సాయంత్రం కలెక్టరే లో అధికారులతో సమీక్ష నిర్వహించారు .

కరోనా వ్యాధి విస్తరించకుండా నిరోధించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు . అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని , ప్రభుత్వం , వైద్యులు సూచించిన మేరకు వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు .

మంత్రి ఈటల రాజేందర్ కూడా వైద్యాధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షించారు . అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు . కరీంనగర్ ఎంపీ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధనను కలసి కరీంనగర్‌లో నెలకొన్న పరిస్థితులను వివరించారు .

corona virus cases in Karimnagar ::

  ఇండోనేసియా బృందం బస చేసిన కలెక్టరేట్ ప్రాంతంలోని ప్రార్థనా మందిరం నుంచి మూడు కిలో మీటర్ల పరిధిలో ఇంటింటా వైద్య పరీక్షల కోసం 100 బృందాలను ఏర్పాటు చేశారు . 

గురువారం మంత్రి గంగుల కమలాకర్ వైద్య బృందంతో కలసి ఇండోనేషియా బృందం బస చేసిన ఇంటితో పాటు , పరిసరాల్లోని వ్యక్తులకు స్వయంగా వెళ్లి వైద్య పరీ క్షలు నిర్వహించారు .

ఇండోనేసియా బృందం ఈనెల 14న రామగుండం రైల్వేస్టేషన్ నుంచి కరీంనగర్ కు వచ్చి ఓ మతపెద్ద ఇంట్లో బస చేయడం , కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రోడ్డులోని ఓ ప్రార్థనా మందిరంలో సమావేశం నిర్వహించడం , ఈ సమావేశానికి 100 మందికిపైగా హాజరైనట్లు తేలడంతో కరీంనగర్ వాసుల్లో ఆందోళన తీవ్రమైంది, కరీంనగర్ రోడ్లపైకి జనం వచ్చేందుకు భయపడుతున్నారు, దీంతో రోడ్లన్నీ బోసిపోయాయి .

Recent posts ::

Related Articles

Back to top button