బెల్లంపల్లిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు బీజేపీ మండల అధ్యక్షులు బుడిమే విజయ్ కుమార్ డిమాండ్. Demand for medical college

మంచిర్యాల జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాలను బెల్లంపల్లి లోనే ( Demand for medical college ) నిర్మించాలని బెల్లంపల్లి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బుడిమే విజయ్ కుమార్ అన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గతంలో 1999 సంవత్సరం లో బెల్లంపల్లి కి మెడికల్ కళాశాల మంజూరు అవడం జరిగిందని టెస్లా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనే ప్రయివేట్ యాజమాన్యం కి అప్పటి ప్రభుత్వం పనులు అప్పగించడం జరిగిందని కొన్ని అనివార్యకారణాల వల్ల అది అర్ధంతరంగా ఆగిపోయిందని అన్నారు. చాలా సంవత్సరాల నిరీక్షణ తరువాత నూతంగా కేంద్ర ప్రభుత్వం మంచిర్యాల జిల్లా కు మంజూరు చేసిన మెడికల్ కాలేజీ ని బెల్లంపల్లి లో ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు.

బెల్లంపల్లి లో ఏర్పాటు చేయడం వల్ల మంచిర్యాల జిల్లా ప్రజలతో పాటు ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయలు అందించేదుకు బెల్లంపల్లి మధ్యలో ఉంటుందని అన్నారు. బెల్లంపల్లి లో ఏర్పాటు చేస్తే ప్రజలకు రవాణా సౌకర్యం సులభంగా ఉంటుందని దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతదేశం ను కలిపే హైదరాబాద్ నుండి నాగపూర్ వరకు ఉన్న ప్రధాన రోడ్డు మార్గం జాతీయ రహదారి బెల్లంపల్లి మీదుగా వెళ్తుందన్నారు. సింగరేణి సహకారంతో బెల్లంపల్లి లో ఉన్న సింగరేణి 175పడకల సామర్ధ్యం గల ఏరియా ఆసుపత్రి ని మరియు సింగరేణి కార్యాలయాలను సింగరేణి క్వార్టర్ లను వినియోగించుకునే సౌకర్యం ఉంది.

బెల్లంపల్లి లో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అది మెడికల్ కళాశాల నిర్మాణానికి ఉపయోగ పడుతుందన్నారు. గతం లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అప్పటి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య గారు 2015జనవరి 7 వ తేదీన బెల్లంపల్లి పర్యటనకు వచ్చిన సందర్బంగా మెడికల్ కళాశాల కు బెల్లంపల్లి అన్ని రకాలుగా అనుకూలం అని, బెల్లంపల్లి లో మెడికల్ కళాశాల నిర్మాణానికి కృషిచేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మరియు 2018 సంవత్సరం నవంబర్ 29 నా బెల్లంపల్లి లో జరిగిన శాసన సభ ఎన్నికల ప్రచార సభలో స్వయంగా ఆపదర్మ ముఖ్యమంత్రి హోదాలో కల్వకుంట్ల చెంద్రశేఖర్రావు బెల్లంపల్లి లో వైద్య కళాశాల మరియు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తానని ప్రకటించడం జరిగిందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రక్కన ఉన్నటువంటి కొమురంభీమ్ జిల్లా ఇద్దరు శాసనసభ్యులు చోరువా చూపి బెల్లంపల్లి లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

Related Articles

Back to top button