కూతురి మరణంతో దుఃఖం తో ఉన్న తండ్రిని కాలితో తన్నిన కానిస్టేబుల్, TS police overaction
తెలంగాణ పోలీస్ ఆఫీసర్ ఓవర్ యాక్షన్::
తెలంగాణ సంగారెడ్డి పట్టణంలో ఒక పోలీసు కానిస్టేబుల్ TS police overaction , ఒక తండ్రీ తన టీనేజ్ కుమార్తె మరణం గురించి దుఖిస్తున్న వ్యక్తిని బుధవారం కాలితో తన్నాన ఘటన చోటచేసుకుంది.
తేది 25-02-2020 నాడు వెలిమల గ్రామం , పటాన్ చెరు మండల పరిధిలోని నారయాణ జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం , చదువుతున్న సంధ్యారాణి కాలేజి ఆవరణలో ఆత్మహత్య చేసుకోగా మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భానూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్ట్ మార్బం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరు.
తేది 26-02-2020 నాడు ఉదయం మృతురాలి భంధువులు మరియు మరికొంత మంది స్టూడెంట్ ఆర్గనైజేషన్కు చెందిన వారు ఆసుపత్రిలోని మార్చురీ గది వద్ద ఉన్న పోలీసులను , ఆసుపత్రి సిబ్బందిని అడ్డగించి , మార్చురీ గది నందు భద్ర పర్చిన మృతురాలి శవాన్ని మార్చురీ తాళాలు రాళ్ళతో , కట్టెలతో పగులగొట్టి బలవంతంగా శవాన్ని తరలిస్తున్న క్రమంలో అక్కడే విధులలో ఉన్న పోలీసువారు వారిని ఆపి తిరిగి మృతదేహాన్ని ఆసుపత్రి లో ికి తీసుకొస్తుండగా జరిగిన తోపులాటలో పటాన్ చెరు పోలీస్ స్టేషను చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ , పి . సి . 349 మృతురాలి యొక్క తండ్రిని కాలుతో తన్నిన TS police overaction సంఘటనపై పోలీస్ డిపార్ట్ మెంట్ తరుపున తీవ్ర చర్యలకు సిద్దమైంది .
ఈ చర్యకు పాల్పడిన కానిస్టేబుల్ ను ఏ . ఆర్ . హెడ్ క్వార్టర్ సంగారెడ్డికి అటాచ్ చేస్తూ జరిగిన సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని శ్రీమతి చందన దీప్తి ఇంచార్జ్ యస్ . పి . సంగారెడ్డి జిల్లా గారు తెలిపారు.
ఇ ఘటనపై మినిస్టర్ కే టీ ఆర్ గారు ట్విట్టర్లో స్పందిస్తూ బాధితుడిని తన్నిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హోమ్ మినిస్టర్ మరియు తెలంగాణ డీ జీ పి నీ కోరారు. బాధలో ఉన్న వ్యక్తి పైన ఇలాంటి చర్యలు తగదు అని అన్నారు.